సిరిసిల్ల జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ చాంద్ పాషా ను భారత రాష్ట్ర సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పరామర్శించారు.గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేసుకున్న చాంద్ పాషాను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం కలిసి పరామర్శించారు. చాంద్ పాషా ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. పరామర్శించిన వారిలో బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ వీర్నపల్లి మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ, ఎల్లారెడ్డిపేట యాదవ కురుమ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు మెండే శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
