ప్రాంతీయం

*ప్రభుత్వానికి బిసిలు అంటే ఎందుకు అంత వివక్ష* *—-కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్*

150 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 8,  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో జనాభా పరంగా సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు తీరని అన్యాయం చేశారంటూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈయేడాదికి సంబంధించి బడ్జెట్లో బీసీల పట్ల రాష్ట్రప్రభుత్వం సవతితల్లి ప్రేమనుచూపించినట్లుందన్నారు. ఈమేరకు సిరిసిల్ల లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో రవి గౌడ్ మాట్లాడుతూ రూ.2,90,396 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు గాను కేవలం రూ.6,229కోట్లను కేటాయించడం ఏమిటని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది కేవలం భిక్షమేసినట్లుగా ఉందంటూ ఆయన ఎద్దేవ చేశారు. తద్వారా రాష్ట్రంలో బీసీలను అవమానించారని, ఇట్టి విషయాన్ని బీసీ సామాజిక వర్గం దృష్టికి తీసుకెళతామని ఆయన వెల్లడించారు. ఇది పూర్తిగా బీసీల వ్యతిరేక బడ్జెట్గా రవి గౌడ్ అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్,మండల అధ్యక్షులు మట్టే నరేష్ ,పట్టణ అధ్యక్షులు రుద్రావెని సుజిత్ కుమార్, నాయకులు, రాజు, అఖిల్, అనిల్, శ్రీనివాస్ ,నవీన్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *