ప్రాంతీయం

రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించిన గిరిజనులు.. మాభూములు మాకు కావాలి…

183 Views
  ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి మార్చి 4,  గుండారంలో పోడు భూముల లబ్ధి దారులకు పట్టాలు  ఇప్పించండి రేవంత్ రెడ్డి నీ కలిసి వినతి పత్రం అందించిన గిరిజనులు.
అనేక ఏళ్లుగా పొడు భూమిలో సేద్యం చేసుకుంటున్న తమకు భూమి పట్టాలు ఇప్పించాలని కోరుతూ  మండలంలోని  గుండారం గ్రామ గిరిజనులు
 టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డినీ కలిసి వినతి పత్రం అందించారు. పోడుభూమి లబ్ధిదారుల  సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మా యొక్క పరిష్కారం చూపాలని కోరారు.
 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో గల పోడుభూమిలో అనేక ఏళ్లుగా తమ తాతల్నాటి  నుండి పోడు వ్యవసాయం చేసుకుంటూ భూమిని దున్నుకున్నామని, అట్టి భూములను ఫారెస్ట్ అధికారుల  తమదని స్వాధీనం చేసుకొని భూముల్లోకి రాకుండా అడ్డు కుంటున్ననట్లు గిరిజనులు రేవంత్ రెడ్డికి వివరించారు. ప్రస్తుతం ఆ భూమిలోఫారెస్ట్ అధికారులు మొక్కలు  నాటారని, తమ భూములు తమకు ఇప్పించి న్యాయం చేయాలని గిరిజనులు రేవంత్ రెడ్డినీ కోరారు. గిరిజన రైతుల వెంట పోడు భూమి కమిటీ నాయకుడు కాంగ్రెస్ సీనియర్ రాజు నాయక్ వున్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *