ప్రాంతీయం

రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే – దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెఱుకు శ్రీనివాస్ రెడ్డి

124 Views

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాచిన్ పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం అని పేర్కొన్నారు. శనివారం దౌల్తాబాద్ మండల పరిధిలోని మాచిన్ పల్లి గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ ఆత్మ గౌరవ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచిన్ పల్లి గ్రామంలో దళితుల ఇండ్లు చూస్తే కళ్ళకు నీల్లోస్తున్నాయన్నారు. నియోజకవర్గంలో కొత్త ఇళ్లు కట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు పేద ప్రజలకు ఇండ్లు ఇవ్వాలన్న సోయిలేదని మండిపడ్డారు. గతంలో ముత్యం రెడ్డి చేసిన అభివృద్ది తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఇక్కడి ప్రజలు రుణపడి ఉండాలన్నారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ సరఫరా ఎక్కడ చేస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

స్థలాలు ఉండి ఇండ్లు లేని అర్హులందరికీ 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. 10 నెలల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెరిగిన ధరలను నియంత్రిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కర్నాల శ్రీనివాస్ రావు, మండల అధ్యక్షులు దశరథ్ రెడ్డి, పడాల రాములు, మద్దెల స్వామి, బండారు లాలు, సురంపల్లి ప్రవీణ్, భద్రయ్య, మల్లారెడ్డి, పడాల మల్లేశం, పంజా రమేష్, సంపత్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *