ముస్తాబాద్ ప్రతినిధి మార్చి 4, శ్రీపాద ప్రాజెక్ట్ 9 వ ప్యాకేజీ పనులను పరిశీలించుటకు ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మా పూర్ గ్రామ శివారు కెనాల్ వద్దకు చేరుకున్న టి పి సీ సి అద్యక్షుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని డ్రైవరు సడన్ గా బ్రేక్ వేయడంతో 7వాహనాలు ఒకదాని నొకటి డి కొన్నాయి. అందులో నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి వాహనాలు మీడియాకు సంభందించిన వాహనాలు కావడంతో అందులో ప్రయాణిస్తున్న జర్నలిస్టులకు స్వల్ప గాయాలు కాగా అందులోనే ప్రయాణిస్తున్న వ్యక్తులు కొందరు తీవ్రంగా, మరికొందరు స్వల్పంగా గాయపడ్డట్లు సమాచారం. గాయపడ్డ వారిని సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్చ్చ కొరకు తరలించారు.
అతివేగంగా వాహనాలు డి కొనడంతో కార్లలోని బెలూన్ లు ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పిందని తెలిసింది. ప్రమాదానికి గురయిన కార్లలో వి 6, టి వి9, ఎన్ టివి, ఏబిఎన్, సాక్షి,న్యూస్ 9,బిగ్ టీ చా చెందిన జర్నలిస్టులు వున్నారు.
ఎవరికి ప్రాణాపాయం జరుగకుండా బయట పడటంతో జర్నలిస్టులు ఊపిరి పీల్చుకున్నారు.
