ప్రాంతీయం

నర్మాల ఎగువ. మానేరు డ్యామ్ లో చేపల వేటకువెళ్లి వ్యక్తి మృత్యువాత పడిన ఘటనలో తన భార్య బాలమణి పిర్యాదు మేరకు ఎస్ ఐ మహేష్ కేసు నమోదు చేశారు

133 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు లో గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి దేవయ్య ( 45 ) అనే వ్యక్తి గురువారం మధ్యాహ్నం 2గంటలకు చేపలు పట్టేందుకు తోటి కులస్తులతో సహా నర్మాల ఎగువ మానేరు డ్యామ్ లోకి వెళ్లారు అందరు యధావిధిగా సాయంత్రం 6 గంటల వరకు ఇంటికి తోటి మత్స్యకారులు చేరుకోగా కొత్తపల్లి దేవయ్య ఇంటికి రాకపోవడం తో అతని భార్య బాలమణి శుక్రవారం ఉదయం తోటి మత్స్యకారుల వద్దకు వెళ్లి అడుగగా వెంటనే వారందరు కలసి ఎగువ మానేరు డ్యామ్ వద్దకు వెళ్లి వెతుకగా ఎగువ మానేరు ప్రాంతం లో అతని చెప్పులు ద్విచక్ర వాహనం ఒద్దు వద్ద ఉండడం తో వారికీ అనుమానం వచ్చి డ్యామ్ లో గాలింపు చేయగా చేపల వల చిక్కుకోవడం తో మృతి చెందినట్లు గుర్తించారు తన భర్త శవం నీటిలో లభ్యంమైనట్లు మృతుడి భార్య బాలమణి గంభీరావుపేట ఫోలీస్ స్టేషన్ లో ఇచ్చిన పిర్యాదు మెరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ మహేష్ పేర్కొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7