రైతు ఆర్థికాభివృద్ధి కి కృషి
సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి* గారి ఆధ్వర్యంలో దీర్గకాళిక రుణాలకు సంబందించిన 3మంది రైతులకు గాను 11,00,000/- లక్షల రూపాయల రుణాన్నిలబ్దిదారుల కు అందజేసారు.
వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరచడం కొరకు TESCAB క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గారి సహకారంతో దీర్గకాళిక రుణాలు పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా పంపిణి చేయటం జరుగుతుంది అని ఈ సందర్భంగా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి తెలియజేసారు.
రైతులు ఆర్ధిక స్వావలంబన సాదించాలంటే వ్యవసాయం తో పాటు దాని అనుబంద రుణాలు అయిన డైరీ,గొర్రెలు ,పట్టు పురుగులు,కోళ్ళపెంపకం,బోరు మోటార్ పైప్ లైన్, ట్రాక్టర్,హీర్వేస్టర్ లకు సహకార సంఘాలకు ఇచ్చే ధీర్గకాలిక రుణాలు వాడుకొని ముందుకు సాగాలని వారు కోరారు. లబ్దిదారులు:-
1). బిర్ల బాలమల్లవ్వ 5,00,000/-(రాగట్ల పల్లె),
2). సిరిపురం లక్ష్మీ 3,00,000/-(నారాయణ పూర్)
3), తాడ ప్రతాపరెడ్డి 3,00,000/-(కొరుట్ల పేట),
లక్షల రూపాయల చెక్కులను అందజేశారు
ఈ కార్యక్రమములో సంఘ ఉపాధ్యక్షులు *జంగిటి సత్తయ్య డైరక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి,సంఘ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
