రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారం జగదేవపూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, షాధి ముబారక్ చెక్కులను ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ,మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ స్థానిక సర్పంచ్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ లు,ఎంపీటీసీలు,నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
