సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం లోని జడ్.పి.హెచ్.ఎస్ పాములపర్తి,జడ్.పి.హెచ్.ఎస్ మర్కుక్, జడ్.పి.హెచ్.ఎస్ దామరకుంట, జడ్.పి.హెచ్.ఎస్ చేబర్తి తదితర పాఠశాలల లో ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి సుడిగాలి ప్రచారం నిర్వహించి ఉపాధ్యాయులకు ఓటర్ స్లిప్ లు అందించారు . ఈ సందర్బంగా రఘోతం రెడ్డి మాట్లాడుతూ టిటిజెఏసి బలపరిచిన పి ఆర్ టి యు టీ ఎస్అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పైన నిరంతరం శ్రమిస్తున్నటువంటి సంఘం పి ఆర్ టి యు ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి పరిష్కారం కోసం ప్రయత్నం చేసేది కేవలం పి ఆర్ టి యు మాత్రమే కావున గుర్రం చెన్నకేశవరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు తోని గెలిపించాలని కోరారు బ్యాలెట్ పత్రంలో 11వ నెంబర్ లో తమ మొదటి ప్రాధాన్యత ఓటును ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు కార్యక్రమం లో సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి పంతం వెంకట రాజం, మర్కుక్ మండల అధ్యక్షులు రామకృష్ణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, యన్. లక్ష్మీ నారాయణ,రాష్ట్ర ఉపాధ్యక్షులు షాబోద్దీన్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ చారి,ప్రధానోపాధ్యాయులు సుగుణకర్, కృష్ణమూర్తి, నాయకులు వైవిఎన్ రెడ్డి, కేశవరెడ్డి, రమణారావు,సురేందర్ రెడ్డి, రమేష్,భ్రమరాంబ, లావణ్య, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు
