నేటితో జిల్లాలో 2 లక్షలకు పైగ కంటి పరీక్షలను కంటి వెలుగు కార్యక్రమం ద్వారా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే మానవ శరీరాలలోకెల్లా కళ్లు అత్యంత ప్రధానమైనవి అని చెబుతోంది. కంటి సమస్యలు లేని తెలంగాణ రాష్ట్ర సమాజ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రతిరోజు 45 క్యాంప్ లు నిర్వహించి ప్రతి క్యాంపు ద్వారా 150 మంది 18 సంవత్సరాల నిండిన ప్రజల కళ్ళను పరీక్షించి అవసరమైన కంటి వైద్య సేవ అందించడం మరియు కళ్ళజోళ్లను అందించడం జరుగుతుంది. జిల్లాలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక పర్యవేక్షణలో జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు జిల్లాలో 45 వేల రీడింగ్ కళ్లజోళ్లను ప్రజలకు అందించడం జరిగింది. అదేవిధంగా వారి కంటే సమస్యలను బట్టి 7 వేలకు పైగా ప్రిస్క్రిప్టెడ్ అద్దాలను అందించడం జరిగింది. జిల్లాలో కంటి వెలుగు క్యాంపులకు స్పందన చాలా బాగుందని, కంటి వెలుగు క్యాంపులను నిర్వహించి కంటి వైద్య పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకుంటున్నారని అదేవిధంగా కంటి వెలుగు కార్యక్రమం పూర్తయ్యే వరకు ప్రజలందరూ తప్పనిసరిగా కంటి వెలుగు క్యాంపులను వినియోగం చేసుకోవాలని అన్నారు.
