24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మర్కుక్ జూన్ 11.
మర్కుక్ మండల కేంద్రంలో శ్రీ మహంకాళి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవాలు మర్కుక్ గ్రామ పురోహితులు మాధవ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మహంకాళి అమ్మవారి ఉత్సవాలను ఉద్దేశించి గ్రామ పురోహితులు మాధవ శర్మ మాట్లాడుతూ పూర్వకాలంలో మొర్సు వంశస్థులు వారి పొలంలో వ్యవసాయం చేస్తుండగా భూగర్భంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం బయటపడింది. అనంతరం గ్రామ పెద్దలు చెప్పినటువంటి మాట మేరకు మర్కుక్ గ్రామంలో భావానంద స్వామి యొక్క శిష్యులైన బుచ్చి రామ్ రెడ్డి స్వామివారి ని అడిగి వారి సూచన మేరకు భూగర్భం నుండి లభించిన విగ్రహాన్ని అదే పొలంలో చర ప్రతిష్ట కావించమని తెలిపారు. వారి సూచన మేరకు ఇప్పటివరకు 50 సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో మళ్లీ అదే విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్ది నూతన దేవాలయాన్ని నిర్మించి పున ప్రతిష్ట చేశారు. ఎంతో మహిమగల విగ్రహం దొరకడం చేత మహంకాళి అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగింది అని అన్నారు. చాలా కాలం నుండి ఎంతో వైభవంగా ఊరేగింపుతో బోనాల ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అదే తరుణంలో చాలా కాలం తర్వాత ఆ గుడి శిదిలం కావడం అనేటువంటిది జరిగింది. వాళ్ల కుమారులు మొర్సు వంశస్థులు సంకల్పించుకొని ఇదే మహంకాళి అమ్మవారి ఆలయాన్ని మా తాత అయినటువంటి బుచ్చిరాం రెడ్డి నిర్మించారు కాబట్టి మేము కూడా వైభవపీతంగా అమ్మవారిని ప్రతిష్ట కార్యక్రమాన్ని చేసుకుందామని సత్సంకల్పం చేత అమ్మవారికి పాలాభిషేకం చండీయాగం పండితుల మధ్య వేదమంత్రాలతో అత్యంత వైభవంగా ప్రతిష్ట చేయడం జరిగింది.శ్రీ మహంకాళి అమ్మవారు ఎంతో మహిమాలతో కలదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు కోరుకున్న కోర్కెలను తీర్చే అమ్మవారు శ్రీ మహంకాళి అమ్మవారిని ఆలయ అర్చకులు తెలిపారు.మర్కుక్ గ్రామ పరిసర ప్రాంత ప్రజలు శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొన్న వారికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాధవ శర్మ,కార్తీక పంతులు,శేషి పంతులు, శంకర్ రెడ్డి, నరసింహారెడ్డి, విభీషణ్ రెడ్డి, రాంరెడ్డి,ప్రశాంత్ రెడ్డి,కిషోర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మొర్సు వంశస్థులు తదితరులు పాల్గొన్నారు.
