రాజకీయం

భీమవరం మండలంలో ఎన్నికల ప్రచారం చేసిన దుర్గం అశోక్

262 Views

చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల్ ఆరెపెల్లి గ్రామంలో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఎన్నికల ప్రచారం నిర్వహించగా , గజ్జెల సురేష్, తిప్పర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ యువత నాయకులు మహిళలు 250 మంది భారతీయ జనతాపార్టీ లో జాయిన్ కాగ వారందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దుర్గం అశోక్.

అనంతరం  అశోక్ మాట్లాడుతూ నాయకులను అంగట్లో సరుకులు కొన్నట్టు కంటున్నారని బాల్క సుమన్ ఐదు సంవ్సరాలపాటు ఎంపీ గా , ఇప్పుడు ఐదు ఏండ్లు చెన్నూర్ ఎమ్మెల్యే గా ఉన్నా పేద ప్రజలకు చేసింది ఏమి లేదని, ప్రజలంతా టిఆర్ఎస్ పార్టీకీ పూర్తీగా వ్యతిరేకంగా ఉన్నారని ,కాంగ్రెస్ పార్టీ వివేక్ వెంకట స్వామి తన తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని వారి కుటుంబం ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయంగా ఎదిగి వేల కోట్లు సంపాదించారు.

కాగా చెన్నూర్ పేద ప్రజలకు చేసింది ఏమి లేదని తను  ఎంపీ గా కాని తన తండ్రి గాని తన అన్న గడ్డం వినోద్ గాని చెన్నూర్ నియోజకవర్గ ప్రజలకు ఏంచేశారు అని అన్నారు .

ఇన్నిరోజులు టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ బాల్క సుమన్ గాని  ఎవరైనా ఏమైన అంటే ఒంటి కాలు మీద లేచే నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెల్లి దొంగే దొంగా అన్నట్టు టిఆర్ఎస్ ను వాల్లే అంటున్నారు. వారి మాటలు నమ్మి మిరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వివేక్ స్థానికంగా ఉండడు కనుక మల్లీ మీపైన పెత్తనం చేయాలని కాంగ్రెస్ ముసుగు వేసుకొని వస్తున్నారు, పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన  టిఆర్ఎస్ పార్టీకీ ఓటు వేసినా మల్లీ ఐదు సంవత్సరాల గోస పడతారని అన్నారు.

అందుకే మిరు అందరు ఆలోచించండి నేను మీకు ఎనిమిది సంవత్సరాలుగా సేవలు చేస్తున్నా ఆశీర్వదించండి ఆదరించండి మీ అందరికి అందుబాటులో మీ కుటుంబంలో ఒకడిగా ఉంటానని మీరందరు ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తు కు మీ అమూల్యమైన ఓటు  వేసి గెలిపించాలని చేతులు జోడించి వేడుకున్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *