విద్యార్థినీ విద్యార్థులు శ్రద్ధతో చదువుకోవాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సైన్స్ డే పురస్కరించుకొని బుదవారం నాడు గజ్వేల్ లోని సాయి జిడిఆర్ స్కూల్ లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు జిల్లాస్థాయి మ్యాథమెటిక్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది వివిధ పాఠశాలల నుండి దాదాపు 20 మంది పాల్గొనగా ప్రథమ బహుమతి సెంట్ మేరీ స్కూల్ విద్యార్థి సాయి సాత్విక్, ద్వితీయ బహుమతి సాయి జిడిఆర్ స్కూల్ విద్యార్థి అశ్వంత్ రెడ్డి కి డిక్షనరీలు ప్రధానం చేసి పాల్గొన్న ప్రతి విద్యార్థికి జ్ఞాపికలు ప్రధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఏసిపి రమేష్ గౌడ్, ఏబిజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజలింగం పాల్గొన్నారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు, విజ్ఞానం, భౌగోళిక అంశాల మీద అవగాహన క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తల్లి తండ్రులకు గుర్తింపు తీసుకురావాలని పదవ తరగతి జీవితంలో ఒక మైలురాయి అని శ్రద్ధగా చదువుకోవాలని , క్రమశిక్షణతో ఉంటూ తల్లిదండ్రులను గురువులను గౌరవించాలని ప్రతి ఒక్కరు ఒక లక్షం ఏర్పరచుకొని ఆ లక్ష్యం కోసం కృషి చేయాలని,విద్యార్థికి పుస్తక పరిజ్ఞానంతో పాటు సమాజం అనే పుస్తకాన్ని చదవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శిలసారం ప్రవీణ్, ఏబిజేఎఫ్ జిల్లా కార్యదర్శి గుడాల శేఖర్,సభ్యులు కృష్ణంరాజు, ఆంజనేయులు, నర్సింలు, సాయి జి డి ఆర్ యాజమాన్యం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
