ప్రాంతీయం

దేశ వ్యాప్త స్వచ్ఛ సర్వేక్షణ్ 2023..గ్రామీణంలో సిద్ధిపేట జిల్లా ప్రథమ స్థానం గ్రామ ప్రజాప్రతినిధులు, అధికార యంత్రగాన్ని అభినందించిన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు

132 Views

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 ర్యాంకుల్లో భాగంగా మొదటి త్రైమాసిక ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జిల్లాలోని అన్నీ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికార యంత్రగాన్ని, సిబ్బందిని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ తో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితోనే ఇది సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. కాగా జిల్లాలోని అన్నీ గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారానే గ్రామాలు సంపూర్ణ స్వచ్ఛ పంచాయతీలుగా రూపుదిద్దుకోవడం జరుగుతున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో భాగంగా, ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్లు పాఠశాలల్లో అంగన్వాడి కేంద్రాల్లో మరియు పంచాయతీల్లో మరుగుదొడ్ల సౌకర్యం, ఘన మరియు ద్రవ వ్యర్ధాల ఏర్పాట్లు మొదలగు కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా సిద్ధిపేట జిల్లా మూడవ స్టార్ కేటగిరీ నుంచి నాలుగో స్టార్ కేటగిరికి రావడం జరిగింది. మొదటి త్రైమాసిక ఫలితాల్లో దేశవ్యాప్తంగా ఆన్లైన్లో నమోదైన వివరాల ప్రకారం మన జిల్లా దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రెండవ స్థానంలో నిలవగా, కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. ఇందుకుగాను గ్రామపంచాయతీలో ఈ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అభినందనలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *