– నూతన విద్యా కమిటీ చైర్మన్ బైరగోని రమేష్
చందుర్తి – జ్యోతి న్యూస్
చందుర్తి మండలం నర్సింగాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ నూతన విద్యా కమిటీ చైర్మన్ గా బైరగోని రమేష్, ఉపాధ్యక్షులుగా దొబ్బల లక్ష్మి లను మంగళవారం ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… సమాజంలో విద్యకు అధిక ప్రాధాన్యత కలిగినది కావున విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి కలుగుతాయి కాబట్టి పాఠశాల అభివృద్ధికి మౌలిక వసతులకు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బైరగోని లావణ్య, సర్పంచి రాపెల్లి గంగాధర్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, కమిటీ సభ్యులు చింతకుంట గంగాధర్, సంపునూరి దేవయ్య, కొత్త శ్రీనివాస్ రెడ్డి, దయ్యాల పరశరాములు, గుర్రం లత, సత్తయ్య, గంగయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.