బీటీ రోడ్డు మంజూరు చేయాలని ఎంపీపీకి వినతి పత్రం
చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి పెద్దిరాజుపేట వరకు ఒక కిలోమీటర్ దూరం బిటి రోడ్డు మంజూరు చేయాలని కత్తుల భాస్కర్ రెడ్డి ఎంపీపీ కర్ణాకర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపల్లి నుండి పెద్దిరాజుపేట వరకు బీటీ రోడ్డు లేక వర్షం పడడం వల్ల విద్యార్థులకు ప్రయాణికులకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గత పది సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారని పేర్కొన్నారు ప్రజల అవసరాల నిమిత్తం వెంటనే బీటీ రోడ్డు మంజూరు చేసి పనులు చేపట్టాలని కోరారు దీనికి ఒక కోటి 23 లక్షల ఖర్చవుతుందని తెలిపారు దీనికి స్పందించిన ఎంపీపీ నెల రోజులలో మంజూరు చేస్తానని తెలిపారు దీనికి పోతిరెడ్డిపల్లి గ్రామం తరపున ఎంపీపీ కత్తుల భాస్కర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు





