గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అంటించిన లబ్ధిదారుల జాబితా అసమగ్రంగా ఉందని సమగ్రంగా సర్వే చేయాలని అర్హులందరికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇండ్లు ఇవ్వాలని స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మున్సిపల్ పట్టణంలో మొత్తం పూర్తిగా సమగ్రంగా సర్వే చేయకుండా కొంతమందికి మాత్రమే ఫోన్లు చేసి వారి ఇండ్లకు మాత్రమే పరిమితమై సర్వే నిర్వహించడం జరిగిందని అసలైన లబ్ధిదారులు, ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు గుడిసెల్లో ఉన్నవారు అందరిని , వివిధ కాలనీలో అద్దెలకుంటున్న పేదలను ఎంపిక చేయకుండా కొన్ని పేర్లు రాసి లబ్దదారుల జాబితాని ప్రకటించడం ఫలితంగా పేదలకు అన్యాయం జరుగుతుందని అన్నారు పట్టణంలో సుమారు పదివేల మందికి పైగా కుటుంబాలు స్థానికంగా అన్ని రకాలుగా ఆధారాలు కలిగి ఉండి అద్దెకు ఉంటున్నారని అన్నారు గజ్వేల్ పట్టణంలో గత 20 సంవత్సరాలుగా గీతంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లు రద్దుచేసి చేసిందని అన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో ఒక్కరికి కూడా కూడా ఇల్లు ఇవ్వలేదని అన్నారు ఇల్లు లేని పేదలందరికీ న్యాయం చేయాలని సమగ్రంగా సర్వే చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎంపిక చేయాలని అన్నారు స్థలాలు ఉన్నవారికి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం ఐదు లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు మల్లన్న సాగర్ పునరావాస కాలనీ , ప్రభుత్వం వివిధ సందర్భాల్లో సేకరించిన భూమికి ఎకరాకు 600 గజాల చొప్పున స్థలం రైతుల కుటుంబాలకు అందజేయాలని డిమాండ్ చేశారు