Breaking News

గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ

180 Views

తిమ్మాపూర్ మండలంలోని నేదునూరు గ్రామంలో వెయ్యి గొర్రెలు, మేకలకు పశు వైద్య అధికారి డాక్టర్ కేడి సాంబారావు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జీవాలకు నట్టల నివారణ మందును త్రాగుపించారు.

అనంతరం సాంబారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న నటుల నివారణ మందులను గొర్రెల కాపర్లు సద్వినియోగం చేసుకొని జీవాల పెరుగుదల అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా కార్యదర్శి కాల్వ సురేష్ మాట్లాడుతూ గొర్రెలకు నట్టలమందే కాకుండా లివర్ టానిక్ , బలానికి మందులు కూడా ఉచితంగా ఇస్తే గొర్ల కాపరులకు మరింత సాయం చేసి పశు సంపద అభివృద్ధికి రైతు కు ఆర్థిక ఇబ్బందులూ లేకుండా చేసినవారు అవుతారు అని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో గొర్ల కాపర్లు కాల్వ రాజయ్య, కాల్వ మల్లయ్య, మల్లెత్తుల బాలయ్య, కాల్వ కనకయ్య, మల్లెత్తుల మల్లయ్య, కాల్వ నరేష్, కాల్వ శ్రీనివాస్, మల్లెత్తుల అజయ్, సముద్రాల కనుకయ్య, వైద్య సిబ్బంది రమేష్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *