బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్.
ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 21, విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇన్చార్జ్ ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ వచ్చిన అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లేకపోవడం బాధాకరమని అన్నారు. ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు చదువుకు ఉన్న గొప్పతనం తెలియజేసి అందరికీ విద్యను అందించిన వారిని గుర్తు చేశారు. జ్యోతిరావు పూలే కార్యక్రమం సావిత్రి బాయ్ పులే గారు కూడా మహిళలకు విద్యను అందించిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మరియు సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రానున్న రోజుల్లో తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇన్చార్జ్ ఇల్లందుల ప్రకాష్ నాయకులు రంగు దినేష్ , బడుగు వినయ్, వాసం శ్రీయజ్, నీలి మహేష్, పసుల కార్తీక్ , కుండారపు రాజ్ కుమార్, గుంటి మహేష్, సదుల దేవేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
