ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 21, ముస్తాబాద్ మండలంలోభారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఈశ్రమకార్డు అందించడం జరిగింది. ఈ కార్డు పొందడంద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలకు అర్హులవుతారు. అదేవిధంగా సంవత్సర కాలం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఇన్సూరెన్స్ ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షలు శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే ఒక లక్ష బీమా వర్తిస్తుంది అని తోట ధర్మేందర్ తెలిపారు. 16 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్నవారు అందరూ ఈశ్రమ కార్డు తీసుకోవడానికి అర్హులు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ ట్రాలి ఆటో యూనియన్ సభ్యులు ముచ్చర్ల.నరేష్ , ఎదునూరికిషన్, ఎదునూరి శ్రీనివాస్, మీసాశంకర్, సుసుతారిమల్లేశం, జంగంశివకృష్ణ, ఎడ్లదేవయ్య, కుడుధులసాయి, ఎడ్ల.దేవయ్య, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
