దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రణం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గాజులపల్లి గ్రామంలో ముదిరాజులు గత మూడు నెలల క్రితం జెడ్పిటిసి రణం జ్యోతిని కలిసి ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కావాలని కోరారని వెంటనే జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ జిల్లా పరిషత్ నిధులను నాలుగు లక్షలు మంజూరు చేశారని. బుధవారం మండల ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ తో కలిసి మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ముదిరాజ్ భవనానికి శంకుస్థాపన చేశారు . అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన జడ్పిటిసి రణం జ్యోతి కి ఆ గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అల్లి శేఖర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, దొమ్మాట మాజీ సర్పంచ్ మోహన్ రావు, శేర్ పల్లి బందారం ఎంపీటీసీ నవీన్ కుమార్, సీనియర్ నాయకులు నర్ర సత్యం, రాయపోల్ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్ప దయాకర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిక్కుడు సత్యనారాయణ, చంద్రం ,స్వామి ,మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




