రుద్రమ గెలుపు కోసం వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు…
ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 29, సిరిసిల్ల నియోజకవర్గ బిజెపిపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించిన రాణి రుద్రమ పిలుపు కోసం వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సిరిసిల్ల పట్టణంలో బిజెపి సీనియర్ నాయకులను బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారని చికోడు గ్రామ బూత్ అధ్యక్షుడు ఊరడి రాజు తెలిపాడు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ పార్టీ అనేక సందర్భాలలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో సిరిసిల్ల ప్రాంత బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు తమ ఆడబిడ్డగా నన్ను ఆదరించిన సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం నాఅదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం అభివృద్ధి దిశగా వెళ్తానని అన్నారు. ఈఅవకాశాన్ని వినియోగించుకొని సిరిసిల్లలో కాషాయ జెండా ఎగుర వేసేందుకు సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదాన్ని పుచ్చుకొని సిరిసిల్ల బిజెపి అభ్యర్థిగా నాపై నమ్మకం ఉంచి నన్ను ఎంపిక చేసినందుకు రాష్ట్ర మరియు జాతీయ నాయకత్వం నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ వీరందరికీ సమావేశంలో పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారని ఊరడి రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల వివిధ హోదాలుగల బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారని పేర్కొన్నారు.
