ప్రాంతీయం

దేశానికి ఆదర్శంగా సీఎం కేసీఆర్ పాలన బీఆర్ఎస్ కు అండగా నిలుస్తున్న సబ్బండ వర్గాలు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి

114 Views

తొగుట; తెలంగాణ ను సాధించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమం లో తెలంగాణ ను దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు ..మండలంలోని గుడికందుల, గోవర్ధనగిరి, వర్ధరాజ్ పల్లి లో బీఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు… పార్టీకి కార్యకర్తలు కీలకమని వారు క్రియాశీలకంగా పనిచేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత ఏర్పడిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు.. .గతంలో కరువు కాటకాలతో తాగు, సాగునీటి కోసం తోటి అష్ట కష్టాలు పడ్డామని ఆయన తెలిపారు. నేడు ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని, 24గంటల కరెంటు, సాగునీరు అందిస్తున్నామని ఆయన తెలిపారు.
సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ దోమల కొమురయ్య లు మాట్లాడుతూ 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు..తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి మోడల్ గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు..వచ్చే ఎన్నికల్లో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయ డంఖా మోగించడం ఖాయమన్నారు గుడికందులలో బూత్ కమిటీ అధ్యక్షులుగా హెచ్ గురువారెడ్డి, బంగారుగల్ల ఈశ్వర్, మంగలి నర్సింలు, ఉప్పరి కమలాకర్, సోషల్ మీడియా ప్రతినిధిగా దావలగల్ల కిష్టయ్యలను, గోవర్ధనగిరి లో బూత్ కమిటీ అధ్యక్షులుగా గడ్డం రాఘవులు, సోషల్ మీడియా ప్రతినిధిగా అయ్యవారి పరమేష్, వర్ధరాజ్ పల్లి లో బూత్ కమిటీ అధ్యక్షుడిగా ఎర్వ జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గా పోతుగంటి రాజిరెడ్డి, ప్రతినిదులుగా కోతి సంతోష్, ఎర్వ కమలాకర్ రెడ్డిలను ఎన్నుకున్నారు.. అలాగే 100 ఓట్లకు ఒక ఇంఛార్జీలను ఎన్నుకున్నారు. వారిని ఘనంగా సన్మానించారు. కార్య

క్రమంలో మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సిరినేని గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్ తోయేటి ఎల్లం, రైతు బంధు మండల అధ్యక్షుడు బోధనం కనకయ్య, ఎంపీటీసీ కొమ్ము శరత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది రాంరెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు పులి రాజు, నంట పరమేశ్వర్ రెడ్డి, బైరయ్య, ఆత్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బైరాగౌడ్, బాల్ రెడ్డి, దుబ్బాక కనకయ్య, నాయకులు సుతారి రమేష్, మంగ నర్సింలు, స్వామి రెడ్డి, చెత్రి శ్రీనివాస్, కనకయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *