సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్ ఏపీజీవీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈరోజు మంగళవారం మహిళలకు ఖాతాదారులకు విద్యార్థులకు పొదుపు మరియు ఇన్సూరెన్స్ గురించి అవగాహన సదస్సు బ్యాంకు మేనేజర్ మోహన్ రాజు ఈరోజు చేపట్టారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ మోహన్ రాజు మాట్లాడుతూ మహిళా సంఘాలకు ,విద్యార్థులకు, పలువురికి నాబార్డ్ మరియు ఆర్బిఐ బ్యాంకు సహకారంతో మ్యాజిక్ షో ద్వారా పొదుపు మరియు ఇన్సూరెన్స్ గురించి వివరించడం జరిగిందని చెప్పారు .ప్రజలు అధిక వడ్డీ ఆశతో ప్రైవేటుగా డబ్బు వడ్డీ ఆశతో ఇచ్చి అవి వసూలు కాక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటారని అలా కాకుండా బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకులో అకౌంట్ తీసి పొదుపు సేవ్ చేసుకుంటే చాలా మంచిదని డబ్బు జాగ్రత్తగా ఉంటుందని మరియు ఇన్సూరెన్స్ ఎంతో ముఖ్యమని ఆపద కాలంలో ఇన్సూరెన్స్ ఎంతో బాధిత కుటుంబానికి సహాయంగా నిలుస్తుందని అందుకే ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమము పలు గ్రామాల్లో చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ మోహన్ రాజు, జిల్లా ఆర్థిక అక్షరాస్యత అధికారి ప్రవీణ్, మెప్మా లావణ్య సరిత పలువురు పాల్గొన్నారు.
