చెన్నూర్ పట్టణం
కంపు కొట్టుతున్న చెన్నూర్ పట్టణం
రోగాల పాలౌతున్న ప్రజలు
పట్టించుకోని ప్రజా ప్రతినిధులు,అధికారులు.
వాడలల్లో సీపీఎం నాయకత్వం పర్యటన.
గోడు వెళ్లబోసుకున్నా ప్రజలు.
పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలని CPM డిమాండ్
సంకే రవి CPM జిల్లా కార్యదర్శి
చెన్నూర్ పట్టణంలోని మారమ్మ వాడ,బేతాళ వాడ,మున్సిపల్ రోడ్డు, మసీదు రోడ్,ఖాజీపుర,కోట బోడ,లైన్ గడ్డ,నల్లగొండ పోచమ్మ వాడ,ప్రాంతాల్లో ఈరోజు సిపిఎం నాయకత్వం పర్యటించి ప్రజలతో మాట్లాడడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రజలు తమ బాధలను సిపిఎం నాయకత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది.
చెన్నూరు పట్టణంలోని ఈ వార్డులలో పర్యటన చేసిన సందర్భంగా డ్రైనేజీ,రోడ్లు చెడిపోయి మురుగు నీరు ఎక్కడికి కక్కడ నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతున్నది.
పట్టణ ప్రజలు విష జ్వరాలతో రోగాల బారినపడి అల్లాడిపోతున్నారు.
గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో రోడ్లు తవ్వేసి పైప్ లైన్ వేసింది. కాని ఈరోజు వరకు కొత్త రోడ్లు వేయలేదు,మురికి కాలువలు లేక వర్షపు నీరు, రోజువారి మురుగనీరు రోడ్లమీద పారుతున్నాది.
ప్రధాన రోడ్లన్నీ కూడ గుంతలు పడి ప్రజలు నడిచే విధంగా లేకుండా పోయాయి.
ఒకవైపు దుర్వాసన మరో వైపు దోమల బెడదతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఎమ్మెల్యేను ప్రస్తుత ఎమ్మెల్యేను అధికారులను తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు అడిగిన సందర్భంగా త్వరలోనే పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పరిష్కరించలేదు. ప్రజల పట్ల ప్రజాప్రతినిధులు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
చెన్నూరు పట్టణాన్ని చూసే అర్థమవుతుంది.
కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం అధికారులు చేసే అభివృద్ధి జేబులు అని సిపిఎం ప్రశ్నిస్తుంది.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా చెన్నూరు పట్టణం అభివృద్ధికి నోచుకోలేదు ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో కచ్చితంగా పడుతున్నప్పటికీ పట్టణ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోలేదు అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. ప్రజా ప్రతినిదులకు, అధికారులకు ప్రజల బాధలు కనిపించకపోవడం శోచనీయం తక్షణమే ప్రజా ప్రతినిదులు,అధికారులు జోక్యం చేసుకొని చెన్నూరు పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది.
పట్టించుకోని ఎడల ఆందోళన కార్యక్రమాలకు సిపిఎం పిలుపునిస్తోంది.
ఈ కార్యక్రమంలో సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి, బోడంకి చందు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు,
కావేరి రవి కోటపల్లి మండల కార్యదర్శి చెన్నూరు పట్టణ నాయకులు
రాతిపల్లి నగేష్,బండారి శ్రీనివాస్, ఉమారాణి,బోయిరి రమాదేవి,కామేర మధుకర్,
జిమ్మిడి కుమార్,గావిడి భూధమ్మ,అనసూర్య,తులషమ్మ,బోగె నాగ జ్యోతి, బోగె సత్యం తదితరులు పాల్గొన్నారు.
