అంధత్వ నియంత్రణకు కంటి వెలుగు కార్యక్రమం గ్రామ ప్రజలకు ఎంతో సహకరిస్తుందని ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ ,సర్పంచ్ సంధ్యారాణి గణేష్ అన్నారు మంగళవారం రాయపోల్ మండలంలోని రాంసాగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ ప్రారంభించారు .ఈ సందర్భంగా ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ మాట్లాడుతూ కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ కంటి వెలుగు కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళ అద్దాలను అందజేస్తున్నట్లు ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ అన్నారు .గ్రామ ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజిరెడ్డి ఎంపీడీవో మునయ్య ఎంపీఓ లక్ష్మీనారాయణ గ్రామపంచాయతీ కార్యదర్శి నాగరాజు, వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు, వార్డు సభ్యులు కొండారి రమేష్ బొమ్మ శ్రీను, కల్లూరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.