ఘనంగా మాజీ సర్పంచ్ రాజు జన్మదిన వేడుకలు
సిద్దిపేట జిల్లా జూలై 27
జగదేవ పూర్ గ్రామ అభివృద్ధి సంక్షేమంతో పాటు, ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పని చేస్తున్న శ్రామికుడు జన హృదయ నేత ధర్మారం గ్రామ సర్పంచ్,కొరవి కృష్ణ స్వామి జిల్లా అధ్యక్షులు పిట్టల రాజు ముదిరాజ్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింలు పేర్కొన్నారు. శనివారం ఆయన జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి శాలువతో సన్మానించి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో తోటి మిత్రులు రతన్, దాసు పరమేశ్వర్, రాము, అనిల్, రాము, వినోద్. తదితరులు ఉన్నారు.





