దౌల్తాబాద్: జర్నలిస్టు నగేష్ తండ్రి లింగయ్య ఇటీవల గుండెపోటుతో మరణించగా విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు మంగళవారం గాజులపల్లి గ్రామంలో పరామర్శించారు. తండ్రి మరణించడం బాధాకరమని, అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ఆయన వెంట బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్, చేగుంట వైస్ ఎంపీపీ రామచంద్రం, నాయకులు భూపాల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, ప్రసాద్ రావు, అనిల్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు…..




