వీర్నపల్లి వైస్ ఎంపీపీ కుటుంబానికి దుమాల మిత్ర బృందం ఆర్థిక సహాయం అందించారు. గత నెల రోజుల క్రితం వైస్ ఎంపీపీ హేమ భర్త ఈసం పెళ్లి దేవేందర్ అకస్మికంగా మృతి చెందారు. ఇద్దరు కుమార్తెలు చారిక (9) పూర్విక (7 ) లు ఉన్నారు.ఆకాల మరణం చెందిన దేవేందర్ కుటుంబాన్ని దుమాల గ్రామ మిత్రబృందం సర్పంచ్ కదిరేరజిత శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపిటిసిలు కొలనూరి శంకర్, పొన్నం బాలకిషన్, మాజీ ఏఎంసీ చైర్మన్ గుల్లపల్లి నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రేండ్ల హనుమంతు, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బట్టు రాజు, కానాపురం అంజయ్య, సోమారపు శరవిందు,కర్రోళ్ల అంజయ్య,కదిరేరమేష్, కదిరే శ్రీనివాస్, కదిరే రవి, ఇప్ప రవీందర్ రెడ్డి, ఉల్లి బాలయ్య, నిమ్మల బాలు, రేసు జగన్, గ్రామస్తులు 40,000 రూపాయల ఆర్థిక సహాయం వైస్ ఎంపీపీ కుటుంబానికి ఆదివారం అందించారు. దాతలు మానవతా దృక్పథంతో దేవేందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని మిత్ర బృందం కోరుతున్నారు.
