- శివాజీ జయంతిని పురస్కరించుకుని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో 55కిలోల బియ్యాన్ని ఉపయోగించి శివాజీ ప్రతిరూపాన్ని అత్య అద్భుతంగా చిత్రించి ఆదివారం రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ పేరు చెప్పగానే ప్రతి హిందువు రక్తం ఉరకాలేస్తుంది అన్నారు. వీరుడు శూరుడు హిందువుల పాలిట దేవుడు చిత్రపతి శివాజీ అన్నారు. మొఘల్ రాజుల ఆకృత్యాల నుండి భారతీయులను కాపాడిన మహా నీయుడు శివాజీ అన్నారు.
