మర్కూక్ మండల కేంద్రంలో శివాలయం వద్ద ఉన్న హనుమాన్ గుడిలో ఆదివారం మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా సీనియర్ నాయకులు మొర్సు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు,అన్నదాన కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా మర్కూక్ ఎస్ ఐ హరీశ్ గౌడ్, బీ ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ . మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, పాల్గొన్నారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దైవారాధన వల్ల మానసిక ఉల్లాసం ఆనందం కలుగుతుందని ప్రతి ఒక్కరూ భక్తి భావం కలిగి ఉండాలని,మహా శివుని అనుగ్రహం తో అందరూ సంతోషంగా ఉండాలని శివుడికి అభిషేకం చేసి ప్రార్థించామని అన్నారు ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ నాయకులు, బాపు రెడ్డి, హనుమంత్ రెడ్డి, మోర్సు రామ్ రెడ్డి, బాల నర్సయ్య, శ్రీకాంత్ గౌడ్,లక్ష్మారెడ్డి, రాజు, సుధాకర్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి,సత్యనారాయణ,మల్లేశ్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు




