ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు.. వారితోనే పార్టీకి తీవ్ర నష్టం: దామోదర రాజనర్సింహ

113 Views

తెలంగాణ కాంగ్రెస్ కొత్త కమిటీల చిచ్చు తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి కొండా సురేఖ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మరో సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకి న్యాయం జరగడం లేదని ఆక్షేపించారు. హైకమాండ్ను గౌరవిస్తామని.. కానీ ఆత్మగౌరవాన్ని మించింది ప్రపంచంలో ఏదీ లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పదవుల విషయంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు అన్యాయం జరిగింది. జిల్లాల వారీగా పార్టీ నాయకుల పనితీరును అంచనా వేసిన దాఖలాలు లేవు. విభేదాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా జరిగింది. కోవర్టులు ఉండటం వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. వారికి పార్టీలోని అగ్రనేతలు ఎందుకు మద్దతుగా ఉంటున్నారు? కోవర్టులని తెలిపే ఆధారాలు ఉన్నాయి.. అవి కూడా చూపించాం. సమయం వచ్చినపుడు ఆ పేర్లు బయటపెడతాం. పదవులు ఇవ్వొద్దని మేం అనడం లేదు. ఇచ్చేవాళ్లకి అర్హత ఉందో లేదో విశ్లేషణ, అధ్యయనం చేశాక ఇవ్వాలని మాత్రమే చెప్తున్నాం. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, టి పి సి సి కాంగ్రెస్ డెలికేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి, తిగుల్ గ్రామ సర్పంచ్ భాను ప్రకాష్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు అఙ్గర్, తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Gangolla Sreenivas gajwel