ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి15, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కేటీఆర్ చేసినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు అమలుచేస్తూ తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఏప్రభుత్వం చేయని పథకాలు నిధులు నియామకాలు ఈరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో మాఎస్టి సంఘాలకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈసందర్భంగా సేవాలాల్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా గిరిజనలు సంప్రదాయ పద్ధతులతో ఉట్టిపడేలా ముస్తాబాద్ మండల కేంద్రంలో డీజే డప్పు మేళాలతో ర్యాలీగా నూతన పద్ధతిలో నిర్వహించారు. గిరిజన సంఘాల ప్రజలు అనాదికాలంనుండి వస్తున్న సాంప్రదాయాన్ని ఘనంగా 284, జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాంమని తెలిపారు. మండల అభివృద్ధి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించి గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏట ఫిబ్రవరిలో సేవాలాల్ జయంతిని నిర్వహించాలని తీర్మానంతో అభివృద్ధి కార్యాలయంలొ మాట్లాడుతూ ఇకపై సేవాలాల్ జయంతిని సరైన సమయంలో నిర్వహిస్తామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో (ఎస్టికిసంబంధించిన) సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మాజీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
