బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చెప్పట్టిన భారత్ జోడో యాత్రలో పిలుపునిచ్చిన హత్ సే హత్ జోడో యాత్ర నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాదయాత్ర బుధవారం పాలకుర్తికి చేరుకుంటున్న సందర్బంగా ఈ యాత్రకు సంఘీభావంగా కరీంనగర్ నియోజకవర్గ నాయకులు మరియు దివంగత ఎమ్మెస్సార్ మనువడు మేనేని రోహిత్ రావు ఆధ్వర్యంలో చలో పాలకుర్తి నినాదంతో కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలతో హత్ సే హత్ జోడో యాత్రక భారీ ర్యాలీగా యాత్రకు బయలుదేరి పాలకూర్తి యాత్రలో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా మేనేని రోహిత్ రావు మాట్లాడుతూ ఏఐసీసీ పిలుపు మేరకు కొనసాగుతున్న హత్ సే హత్ జోడో యాత్రకు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో పాలకుర్తికి బయలుదేరడం జరిగిందని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తో దేశంలో మంచి మార్పు మొదలైదని, ఈ అవినీతి పాలనకు చరమ గీతం పాడి వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి కరీంనగర్ కాంగ్రెస్ కంచుకోట అని నిరూపిస్తారాని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.
ఈ యాత్రలో జిల్లా నాయకులు, నగర మరియు రూరల్ – కొత్తపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.