ప్రాంతీయం

సంయుక్తంగా స్వచ్ఛంద సంస్థల సేవలు

20 Views

మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, ఇందారం గ్రామం.

సంయుక్తంగా స్వచ్ఛంద సంస్థల సేవలు

జైపూర్ మండలం ఇందారం గ్రామంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు సంయుక్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అదే క్రమంలో స్థానిక గ్రామానికి చెందిన నిరుపేద పల్ల బూదమ్మ దీనిని స్థితిని చూసి రూ 5000 ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు.

ఈ సందర్భంగా మిల్టింగ్ హాట్స్ సేవ సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ పేదలకు అణగారిన వర్గాలకు సామాజిక సేవలను అందించడమే సంస్థ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. సేవాదళం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు హరి ప్రసాద్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో పేదవారికి సహాయ అందించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.సహాయం అందుకున్న పిల్ల బూదమ్మ స్వచ్ఛంద సేవ సంస్థల సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అఖిల గాండ్ల కుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు హరితేజ, స్థానిక ఆర్ఎంపి డాక్టర్ రవికిరణ్, పల్ల రాజబాబు, జర్నలిస్ట్ రాజశేఖర్, పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్