సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు గ్రామ సర్పంచ్ గర్నేపల్లి రజిత రమేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి, ఇట్టి కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, కోఆప్షన్ సభ్యులు గ్రామ పెద్దలు, మహిళలు, దళిత బహుజన సంఘాలు పాల్గొన్నారు.