Breaking News

ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి

253 Views

– – – జిల్లా ఎస్పీలు, కమిషనర్లతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి .

ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ,నేరస్తులకు శిక్షల శాతం పెంచే విధంగా అధికారులు చర్యలు ఉండాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.

సోమవారం డీజీపీ ఆఫీస్ నుండి జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్ ల తో నేర,ఫంక్షన్ వర్టికల్ సమీక్ష సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ….పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారుల పని చేయాలన్నారు.సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ నేరాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఎస్సీ/ఎస్ టి కేస్ లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు వేగవంతంగా స్పందించి పరిష్కారం చూపాలని కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్ మరియు ఆఫీస్ లలో5s ఇంప్లిమెంటేషన్ చేయాలని సూచించారు.వర్టికల్ ఫంక్షనల్ వర్టికల్ వారిగా విధులు నిర్వహించే అధికారులకు సిబ్బందికి రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. ఫంక్షనల్ వర్టికల్ వారిగా విధులు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి వారి పెర్ఫార్మెన్స్ని బట్టి రివార్డు లు ఇవ్వాలని సూచించారు.

ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ , డీఎస్పీ లు చంద్రకాంత్ ,రవికుమార్ ,సి.ఐ వెంకటేష్,బన్సీలాల్,శ్రీలత,సర్వర్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7