సిరిసిల్ల పట్టణంలో చలికి తీవ్రత తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న యాచకులను 20 మందిని గుర్తించి వారికి రాత్రి 8 గంటల సమయంలో ఆర్.ఐ కుమారస్వామి రగ్గులు పంచి మానవత్వం చాటుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో లాఠీ కాఠిన్యం చూపడమే కాదు,పోలీసుల్లోనూ మానవత్వం దాగి ఉందని నిరూపించారు.అనంతరం ఆర్.ఐ మాట్లాడుతూ చలి తీవ్రంగా ఉన్నందున యచకులకు మావంతుగా సహకారం అందజేయడం ఆనందంగా ఉందన్నారు.పోలీసులు ప్రజల రక్షణకే కాకుండా వారి కష్టసమయంలోనూ తోడుగా నిలుస్తున్నారు….
