ప్రాంతీయం

*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బిసిలంటే ఎందుకు అంత చిన్న చూపు – కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…

159 Views

బడ్జెట్ పై నిరసనగా తాసిల్దార్ కార్యాలయంకు ముట్టడి…

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 13, బీసీ విద్యార్థి సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ అధ్యక్షతన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ల ముట్టడి లో భాగంగా ఈరోజు సిరిసిల్ల మండల తాసిల్దార్ అధికారి కార్యాలయం ముట్టడించడం జరిగింది. అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్యం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 57 శాతం వున్న బి.సి లకు కేవలం 2 శాతం నిదులను కేటాయించడం సిగ్గు చేటు అని, ఇప్పుడు ప్రకటించిన 6229 కోట్లకి బదులుగా 50 వేల కోట్లకి పెంచాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీ లకి రాష్టా ప్రభూత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర అన్యాయం చేసింది అని కేంద్ర మంత్రి వర్గంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తూ బడ్జెట్ ని రెండువేల కోట్ల నుండి లక్ష కోట్ల కి పెంచాలని డిమండ్ చేస్తున్నాం. అలాగే దేశ వ్యాప్తంగా జరిగే జాతి జనగణలో బీసీల కులగణనను వెంటనే చేపట్టాలి బిహార్ మాదిగిరా తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్టంలో బీసీ కులగణన చేపట్టాలి బీసీల జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 29 శాతం నుండి 50 శాతంకి పెంచాలి. బీసీ డిమాండ్ల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైకరి తెలియజేస్తూ డిమాండ్ల పరిష్కారానికి అసెంబ్లీ లోనూ పార్లమెంట్ లోనూ తీర్మానం చెయ్యాలి అని బీసీ విద్యార్థి సంఘం పక్షన డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి న్యాయకత్వం లో దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, మండల అధ్యక్షులు మట్ట నరేష్ ,పట్టణ అధ్యక్షులు రుద్రవేణి సుజిత్ కుమార్, మరియు నాయకులు అక్షయ్, హృదేష్,నవీన్, వాసం సూరజ్,నిలి మహేష్, కొందలపు రాజ్ కుమార్,గొంటి మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *