గంభీరావుపేట సెప్టెంబర్ 11
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ప్రజా పాలన కొరకు ప్రతి ఐదు సంవత్సరాలకు వచ్చే ఎన్నికలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి మన దగ్గర ఉన్న అస్త్రం ఓటు అలాంటి విలువైన ఓటును గౌరవించడం మనందరి బాధ్యత అని గంభీరావుపేట భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గంట అశోక్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు. ఓటును అమ్ముకోవడం ద్వారా మన స్వేచ్ఛను కోల్పోవడంతో పాటు, మన బ్రతుకులను మనమే బానిసలుగా ,మార్చుకుంటున్నమన్నారు. మన చేతిలో అధికారం ఇచ్చే ఓటు ఉన్నప్పటికీ రాజకీయపార్టీలు,నాయకులు వెదజల్లే చిల్లర డబ్బుల కోసం, మద్యం కోసం ఆశపడి మన భవిష్యత్తును అమ్ముకుంటున్నామని గంట అశోక్ అన్నారు. ఒక్కసారి ప్రజల చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఓటును ప్రలోభాలకు లొంగకుండా విచక్షణతో ఆలోచించి సరైన పాలకులను ఎన్నుకుంటే మనమిచ్చిన అధికారం ప్రజలను గౌరవించేదిగా ఓటుకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉంటుందని బిజెపి గంభీరావుపేట మండల అధ్యక్షుడు అశోక్ మాట్లాడినాడు.




