దౌల్తాబాద్ మండల బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. దుబ్బాక శాసన సభ్యులు రఘునందన్ రావు ఆదేశాల మేరకు దౌల్తాబాద్ బిజెపి పార్టీ అధ్యక్షులు పోతరాజు కిషన్ ఆదేశానుసారం సూరంపల్లి గ్రామంలో చామంతి, అనసూయ భర్త బాల్ నర్స్, దోమల పవిత్ర భర్త ప్రవీణ్ కి సీఎంఆర్ఎఫ్ చెక్కులు దౌల్తాబాద్ మండల ఉపాధ్యక్షులు, సూరంపల్లి గ్రామ ఉపసర్పంచ్, బొల్లం స్వామి, బిజెపి నాయకులు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బిజెపి నాయకులు ముత్యాల శ్రీనివాస్, చిందం నరసింహులు, కెంబసరి మల్లేశం, తోడంగి నవీన్, బోయ నాగరాజు, కడారి పెద్దోళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
