ప్రాంతీయం

రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన జర్నలిస్ట్ కు చేయూత

71 Views

పెద్దపెల్లి జిల్లా.

రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన జర్నలిస్ట్ కు చేయూత.

రూ.30,300, నిత్యావసర సరుకులు అందజేత

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మనం దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బందెల రాజశేఖర్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిశీలించిన వైద్య బృందం పరిస్థితి చేజారకుండ ఉండటానికి రాజశేఖర్ కుడి కాలును తొలగించారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజశేఖర్ కుటుంబానికి చేయూతనందించేందుకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సేకరించిన విరాళాలు రూ. 30,300, అలాగే నిత్యావసర సరుకులను గురువారం క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు చింతకింది చంద్రమౌళి, నారాయణదాసు అశోక్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లిలో రాజశేఖర్ ను పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. పెగడపల్లి సన్ షైన్ స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ నసీర్ నిత్యావసర సరుకులు అందజేశారు. చేయూతనందించేందుకు సహృదయంతో ముందుకు వచ్చిన జర్నలిస్ట్ లకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలిపారు. ఇంకా దాతలెవరైనా ఉంటే రాజశేఖర్ కు అండగా ఉండటానికి ముందుకు రావాలని, నేరుగా రాజ శేఖర్ సెల్ నెంబరులో 9490099402 సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సలహాదారు కేతిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, కోశాధికారి బెజ్జంకి నరేష్, ఉపాధ్యక్షులు పోగుల విజయ్ కుమార్, వీరమల్ల విద్యాసాగర్ రావు, సభ్యులు నసీర్, జిలకర రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్