కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో జరుగుతున్న దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో కస్తూరి రాజేందర్, కు చెందిన ఇంట్లో ఎవరు లేని సమయాన్ని చూసి దొంగలు ఇంటి పైనుండి లోపలికి వెళ్లి తలుపులు పగలగొట్టి ఒక లక్ష డెబ్భై తొమ్మిది వేల రూపాయల నగదును ఎత్తుకు వెళ్ళినట్లు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు వెంటనే పట్టుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
