Breaking News

అంగన్వాడీ కేంద్రంలో జన్మదిన వేడుకలు

120 Views
  1. చందుర్తి – జ్యోతి న్యూస్

    చందుర్తి మండలం సనుగుల 1వ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు శుక్రవారం జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ చిన్నారులచే కేకు కట్ చేయించి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు జన్మదిన వేడుకలు. అన్నప్రసనం. అక్షరాభ్యాసం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు. గర్భవతులకు. బాలింతలకు పౌష్టికాహారం. పాలు. కోడిగుడ్లు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద సంపూర్ణ భోజనాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు అయేషా, పిల్లల తల్లిదండ్రులు, చిన్నారుల పాల్గొన్నారు. అలాగే మల్యాల గ్రామంలో 1వ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ లకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు మంజుల పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna