*ఏర్పాట్లను పరిశీలించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్, ఎస్పీలు*
రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 18: రాజన్న సిరిసిల్ల జిల్లాకు శనివారం హైకోర్టు న్యాయమూర్తులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎం.జీ. ప్రియదర్శిని, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే లు శుక్రవారం పరిశీలించారు. జిల్లా కోర్టు సముదాయంలో అత్యాచారం, పోక్సో కేసుల పరిష్కారానికి నూతనంగా నిర్మించిన ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ పి. నవీన్ రావు లు ప్రారంభించనున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను, సీసీ కెమెరాల మానిటరింగ్ స్క్రీన్, తదితర వాటిని ఈ సందర్భంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల 9వ అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎం. జాన్సన్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీలేఖ, జూనియర్ సివిల్ జడ్జి సౌజన్య, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, తహశీల్దార్ విజయ్ కుమార్, బార్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
