ప్రాంతీయం

నిరుపేద వధువుకు పుస్తె మట్టలు అందజేత

245 Views

నిరుపేద వధువుకు పుస్తె మట్టెలను అందజేసిన
– గ్రామ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్

నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు పంపిణీ చేసిన రాంసాగర్ స్థానిక సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ అందజేయడం జరిగింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు తిప్పరమైన ఎల్లవ్వ, కిష్టయ్య దంపతుల కుమార్తె రేణుకకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వధువు రేణుకకు పుస్తె మట్టెలు ఆదుకోవడం మానవత్వమని ఆమె అన్నారు. నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలోనే సంతోషం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాయిని రాజిరెడ్డి, వార్డ్ మెంబర్ కొండారు సుగుణ, కోరే దుర్గయ్య, ఆంజనేయులు, కల్లూరి బిక్షపతి, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కొండారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *