Breaking News ప్రాంతీయం

ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదలపై సంబరాలు 

110 Views

రాజాసింగ్ బెయిల్ పై విడుదల కావడంతో బుధవారం రాత్రి మండల కేంద్రమైన దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. హిందూ ధర్మం కోసం శ్రమించిన వారిని ఆపడం ఎవరి తరం కాదన్నారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయిని రాజగోపాల్, కనక రాములు, పెంటయ్య, పోచయ్య, భాస్కర్, ప్రభు, కృష్ణంరాజు, నరేష్, శ్రీశైలం, అరుణ్, హరీష్, శివ, సుందర్ గౌడ్, పంజాల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka