గోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి ఎంపిక
విద్యార్థికి పూలగుచ్చమిఛ్ఛి అభినందించిన కరస్పాండెంట్
:
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కు చెందిన 2019 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థి నీలం పర్షరాములు గోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు ఎంపికయ్యాడు
ఈ సందర్భంగా పర్షరాములు ను విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్
ఎం డి లతీఫ్ , ప్రిన్సిపాల్ శరత్ కుమార్ లు పాఠశాల ఉపాధ్యాయులు పుష్ప గుచ్చమిచ్చి శుక్రవారం అభినందించారు,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నీలం రవి కవిత దంపతులకు ఏకైక కుమారుడైనప్పటికీ పర్షరాములును దేశ సేవ చేయడానికి ఆర్మీ రిక్రూట్మెంట్ కు పంపడం పట్ల టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ,ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవురి వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి లు తల్లి దండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు,
