కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కొండాపూర్, గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ మల్యాల దేవయ్య, తో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అలాగే అందత్వ నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి వేణుమాధవ్, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీవో జోగం రాజు, ఎంపీటీసీ,పల్లె మంజుల రవీందర్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సిఏ,లు అంగన్వాడి కార్యకర్తలు గ్రామపంచాయతీ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
