ప్రాంతీయం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలి…

82 Views
   ముస్తాబాద్, ప్రతినిధి జులై 11, బిసి విద్యార్థి సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో బిసి విద్యార్థి సంఘం కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మరియు జిల్లా డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయం ముందు ధర్నా అనంతరం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేసాం, గత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ప్రకటించారు. ఈప్రభుత్వం గత ఆరు సంవత్సరాల నుండి ఇంతవరకు ఇంటర్  విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మర్చిపోవడం చాలాబాధ కలిగిస్తుందని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులంతా పేద విద్యార్థిని విద్యార్థులు వారికి సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన అమలు చేయాలని మీద్వారా ఈరాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మధ్యాహ్న భోజనము అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేనియెడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈరాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, మండల అధ్యక్షులు మట్టి నరేష్, నాయకులు నవీన్ కుమార్, శ్రీకాంత్, గణేష్ , నీరజ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *